హీరో విజయ్ మెడకు ఐటీ ఉచ్చు

Published on Feb 11,2020 04:47 PM

తమిళ స్టార్ హీరో విజయ్ మెడకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ ఐటీ శాఖవారికి మాత్రం తక్కువ మొత్తం లెక్కలు చూపిస్తూ పెద్ద మొత్తంలోనే వెనుక వేసాడట దాంతో ఇటీవల జరిపిన సోదాల్లో , చేసిన విచారణలో 100 కోట్ల నుండి 150 కోట్ల మేర బొక్కలు తెలిసినట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే విజయ్ మెడకు ఐటీ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని అంటున్నారు. పైకి ఇది రాజకీయ కక్ష్య సాధింపులా కనబడుతున్నా లోలోన జరిగిన విషయాలు బయటకు పొక్కుతుండటంతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

బిగిల్ సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో జరిగిన ఓ చిన్న తొందరపాటు విజయ్ కి ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. బిగిల్ సంచలన విజయం సాధించడంతో ఆ చిత్ర నిర్మాత కూతురు చేసిన ట్వీట్ హీరో విజయ్ పాలిట అశనిపాతం అయ్యింది. 77 కోట్ల నగదు ఆ చిత్ర నిర్మాత దగ్గర దొరికింది. అలాగే 50 కోట్ల రెమ్యునరేషన్ విజయ్ తీసుకున్నట్లు నిర్మాత చెబుతుండగా విజయ్ మాత్రం 30 కోట్లు మాత్రమే అని చెప్పాడట దాంతో సోదాలు , విచారణ చేయడంతో 100 కోట్లకు పైగా లెక్కలు బొక్కలు ఉన్నాయని గుర్తించారట ఐటీ అధికారులు.