అల్లు అరవింద్ పై ఐటీ దాడులు

Published on Mar 09,2019 01:00 PM

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆఫీసుపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవల జరిగింది . అల్లు అరవింద్ ఆఫీస్ పై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయడానికి కారణం విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం , టాక్సీవాలా చిత్రాలే కారణం . గత ఏడాది రిలీజ్ అయిన గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . 

ముఖ్యంగా గీత గోవిందం చిత్రం దాదాపు 70  కోట్ల షేర్ రాబట్టింది . అలాగే టాక్సీవాలా చిత్రం కూడా మంచి వసూళ్ల ని సాధించింది . ఈ రెండు చిత్రాలను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద నిర్మించారు . అందుకే ఆ లెక్కల బొక్కలు చూడటానికి రైడ్ చేసారు అధికారులు .