మహేష్ బాబు పార్ట్ నర్ పై ఐటీ దాడులు

Published on Oct 23,2019 12:24 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు పార్ట్ నర్ పై కేంద్రం ఐటీ దాడులకు పాల్పడింది. నైజాం లో పెద్ద డిస్ట్రిబ్యూటర్ అలాగే ఏషియన్ సినిమాస్ ఓనర్ అయిన సునీల్ నారంగ్ కార్యాలయాలపై ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్ల ని స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఈ ఐటీ దాడుల వల్ల మహేష్ బాబు థియేటర్ అయిన ఏ ఎం బి పైన కూడా దాడులు నిర్వహిస్తారేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో భారీ చిత్రాలను విడుదల చేస్తుంటారు ఏషియన్ సునీల్ నారంగ్ దాంతో ఐటీ అధికారుల దృష్టి పడింది. అలాగే మహేష్ బాబు తో కలిసి భారీ మల్టీప్లెక్స్ ని కట్టారు. ఇండియాలోనే బెస్ట్ మల్టీప్లెక్స్ గా ఏ ఎం బి కి పేరొచ్చింది.