నిర్మాత కె ఎల్ నారాయణ ఇంట్లో ఐటీ దాడులు

Published on Nov 08,2019 09:19 PM
నిర్మాత కె ఎల్ నారాయణ ఇంట్లో ఐటీ దాడులు

తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన డాక్టర్ కె ఎల్ నారాయణ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటుగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పెద గొన్నూరు లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పెద గొన్నూరు కె ఎల్ నారాయణ స్వగ్రామం. ఇక ఈ నిర్మాత స్వగ్రామంలో తనిఖీలు చేయగా అక్కడ రెండు బీరువాలలో ఉన్న వాటిని కూడా వెదకాలని చూస్తున్నారట.

అయితే ఆ బీరువాల తాళాలు హైదరాబాద్ లో ఉండటంతో కె ఎల్ నారాయణ కు కబురు పంపారట! కె ఎల్ నారాయణ స్వగ్రామం రాగానే బీరువాలలో ఉన్నది ఏంటో కనుక్కోనున్నారు. అయితే టాలీవుడ్ లో ఎంతో మంది నిర్మాతలు ఉండగా ఇటీవలి కాలంలో సినిమాలు నిర్మించని ఈ నిర్మాతపై దాడులు చేయడం వెనుక మతలబు ఏంటో ? అని షాక్ అవుతున్నారు.