మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథనట అది

Published on Sep 16,2019 06:59 PM

అర్జున్ రెడ్డి దర్శకుడు మహేష్ బాబు తో సినిమా చేయాలనీ అనుకున్నాడు దాంతో ఓ స్టోరీ లైన్ వినిపించాడట సందీప్ రెడ్డి వంగా అయితే ఆ స్టోరీ లైన్ విన్న మహేష్ భయపడిపోయి రిజెక్ట్ చేసాడు కట్ చేస్తే అదే కథతో ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు దర్శకులు సందీప్ రెడ్డి వంగా. పైగా తనకు తెలుగులో కంటే ఎక్కువగా సొమ్ములు ఇప్పించడమే కాకుండా ఎవరూ ఊహించని క్రేజ్ ని తెచ్చిపెట్టింది బాలీవుడ్ లోనే!

అందుకే మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథని హిందీలో డెవిల్ అనే టైటిల్ తో సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడట సందీప్ రెడ్డి వంగా. తెలుగులో అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ కానీ ఇక్కడ 50 కోట్లు మాత్రమే వసూల్ అయ్యాయి కానీ హిందీలో మాత్రం 300 కోట్ల సినిమా అయ్యింది కబీర్ సింగ్ అందుకే రణవీర్ కపూర్ తో డెవిల్ అనే సినిమాకు రూపకల్పన చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా