ఐటెం సాంగ్ కాదంటున్న మహేష్ బాబు

Published on Dec 30,2019 05:26 PM
మా చిత్రంలో డాంగ్ డాంగ్ అనే పాట ఉంది అయితే దీన్ని ఐటెం సాంగ్ అని అంటున్నారు కానీ అది ఐటెం సాంగ్ కాదని పార్టీ సాంగ్ అని అంటున్నాడు మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దిల్ రాజు , అనిల్ సుంకర లతో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తుండగా కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది. పైగా 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్ చేసింది మహేష్ బాబుతో. ఇప్పటికే డాంగ్ డాంగ్ అనే పాట యూత్ ని ఆకట్టుకుంటుండగా ఆ పాట విషయం పై స్పందించాడు మహేష్ బాబు. అందరూ ఈ పాటని ఐటెం సాంగ్ అని అంటున్నారు కానీ ఇది ఐటెం సాంగ్ కాదని , పార్టీ సాంగ్ అని వివరణ ఇస్తున్నాడు మహేష్ బాబు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని జనవరి 11 న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. మహేష్ మేజర్ పాత్రలో నటిస్తుండగా ఇక ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నాడు.