హీరో విజయ్ నుండి 77 కోట్లు రికవరీ చేసిన ఐటీ శాఖ

Published on Feb 07,2020 07:36 PM

తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటితో పాటుగా మరో 38 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేసి 77 కోట్ల నగదు సీజ్ చేసారు. రెండు రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్ ని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ కు వెళ్లి మరీ విజయ్ ని ప్రశ్నించడమే కాకుండా ఇన్ కం ట్యాక్స్ ఆఫీసుకి తరలించారు. ఆ తర్వాత విజయ్ ఇంటితో పాటుగా మరో 38 చోట్ల తనిఖీలు చేయగా పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది.

మొత్తం 77 కోట్ల నగదు పట్టుబడింది, అయితే ఈ నగదుకు విజయ్ కి ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు విజయ్ సన్నిహితులు. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న మాస్ హీరో విజయ్ కావడంతో ఒక్కో సినిమాకు 50 కోట్ల పైనే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇటీవల బిగిల్ చిత్రంలో నటించాడు విజయ్ , ఆ సినిమా తమిళనాట సూపర్ హిట్ అయ్యింది దాంతో ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ పైన విజయ్ ఇంటిపై కూడా ఐటీ దాడులు చేసారు. పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటంతో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.