50 రోజులు పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్

Published on Sep 05,2019 03:06 PM

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ దిగ్విజయంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. జూలై 19 న విడుదలైన ఈ చిత్రం అర్ద శతదినోత్సవం పూర్తి చేసుకుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో పూరి కూడా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ మంచి బూస్ట్ అందించింది.

ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఉత్సాహంతో విజయ్ దేవరకొండ తో సినిమాకు రెడీ అవుతున్నాడు పూరి జగన్నాధ్. ఇక హీరో రామ్ విషయానికి వస్తే రామ్ కూడా చాలా కాలంగా సక్సెస్ లేక బాధపడుతున్నాడు సరిగ్గా ఇలాంటి సమయంలో సాలిడ్ హిట్ ని తెచ్చిపెట్టింది. అందమైన భామలు నిధి అగర్వాల్ , నభా నటేష్ ల గ్లామర్  ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కస్టపడి , ఇష్టపడి చేసిన ఇస్మార్ట్ శంకర్ 50 రోజులు పూర్తిచేసుకోవడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది.