35 రోజుల్లో 35 కోట్ల షేర్ సాధించిన ఇస్మార్ట్ శంకర్

Published on Aug 22,2019 03:51 PM

జూలై 18 న విడుదలైన ఇస్మార్ట్ శంకర్ 35 రోజుల్లో 35 కోట్ల షేర్ సాధించింది . దాంతో ఈ సినిమాని కొన్న బయ్యర్లకు డబుల్ బెనిఫిట్ దక్కింది . ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని 17 కోట్లకు థియేట్రికల్ రైట్స్ కు అమ్మారు . కాగా 17 కోట్ల షేర్ వస్తే బయ్యర్లు సేఫ్ అయినట్లే కానీ ఈ సినిమాకు 17 కోట్లు 35 కోట్ల లాభం వచ్చింది అంటే డబుల్ ప్రాఫిట్ అన్నమాట . 
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ , నభా నటేష్ , నిధి అగర్వాల్ లు నటించిన విషయం తెలిసిందే . రామ్ కు గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేదు దీంతో సాలిడ్ హిట్ కొట్టాడు రామ్ . ఇక హీరోయిన్ లు నిధి అగర్వాల్ కు నభా నటేష్ లకు కూడా తొలి కమర్షియల్ హిట్ ఈ ఇస్మార్ట్ శంకర్ . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .