ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కథ ఇదే నట !

Published on Mar 06,2020 07:50 AM

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా కథ ఇదే అంటూ ఫిలిం నగర్ సర్కిల్లో చర్చ సాగుతోంది. ఇంతకీ వినబడుతున్న ఆ కథనం ప్రకారం ఈ కథ ఎలాంటిదో తెలుసా ........ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్ళలో నటించిన '' మంత్రిగారి వియ్యంకుడు '' చిత్ర కథని పోలి ఉంటుందట.

ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ , సెంటిమెంట్ , లవ్ ఇలా అన్నీ కలగలిపి ఉంటుంది ఆ సినిమా కట్ చేస్తే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందని కాకపోతే ఆ కథకు కాస్త మోడ్రన్ టచ్ ఇస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ '' అయిననూ పోయిరావలె హస్తినకు '' అని వినబడుతోంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రానికి ఒక నిర్మాత అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కావడం విశేషం.