ఈ భామ విమర్శించింది పవన్ కళ్యాణ్ నేనా ?

Published on Oct 30,2019 11:03 AM
హీరోయిన్ గా వెలిగిపోదామని భావించిన పూనమ్ కౌర్ కు అంతగా కలిసి రాలేదు టాలీవుడ్ లో అయితే అడపా దడపా పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూ మాత్రం వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ లీడర్ కాలేడు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఇలా విమర్శించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నే అని అంటున్నారు నెటిజన్లు.

ఎందుకంటే పూనమ్ ట్వీట్ కింద వరుసగా అందరూ పవన్ కళ్యాణ్ పేరునే ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఈ భామకు చాలా చాలా ఇష్టం అయితే ఎక్కడో తేడా కొట్టింది దాంతో పవన్ కళ్యాణ్ అంటే మండిపడుతోంది పూనమ్ కౌర్. పవన్ కళ్యాణ్ పైన మాత్రమే కాదు దర్శకులు త్రివిక్రమ్ మీద కూడా ఈ భామకు విపరీతమైన కోపం మరి.