అల్లు అర్జున్ చిత్రానికి టైటిల్ అదేనా !

Published on Mar 05,2020 02:39 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రానికి '' శేషాచలం '' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా అందునా శేషాచలం అడవుల్లోనే ఎక్కువగా గంధపు చెక్కల స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే టైటిల్ ని ఈ సినిమాకు పెట్టాలా అని ఆలోచన చేస్తున్నారట.

చిత్తూర్ కు చెందిన రాయలసీమ కుర్రాడిగా అల్లు అర్జున్ నటిస్తున్నాడు ఈ చిత్రంలో. అల్లు అర్జున్ యాస , భాష ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంటుందట. సుకుమార్ ఈ చిత్రం కోసం బాగానే హోమ్ వర్క్ చేసాడని అంటున్నారు. ఇక ఫ్యాన్ మేడ్ శేషాచలం పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమాని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.