తమన్నా కు పెళ్లి మీద గాలి మల్లిందా ?

Published on Nov 25,2019 11:06 AM

29 సంవత్సరాల మిల్కీ బ్యూటీ తమన్నా కు పెళ్లి మీద గాలి మళ్లినట్లుంది అందుకే మంచి వరుడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ అని అంటోంది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చి అప్పుడే 13 ఏళ్ళు అవుతోంది దాంతో మరింత ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించడం కష్టం అని భావించిందేమో ? లేక పెళ్లి మీద గాలి మల్లిందో కానీ తగిన వరుడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను అని స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

ఇటీవలే సైరా నరసింహారెడ్డి చిత్రంలో మంచి పాత్ర లభించింది తమన్నాకు. తనకు లభించిన పాత్రని అద్భుతంగా పోషించి మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. తాజాగా యాక్షన్ అనే చిత్రంలో కూడా నటించి శభాష్ అనిపించింది. ఐతే ఇంతకుముందులా కెరీర్ వేగంగా మాత్రం సాగడం లేదు అందుకే పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్లుంది తమన్నా.