అఖిల్ కు పూజా హెగ్డే కలిసివస్తుందా ? దెబ్బకొడుతుందా ?

Published on Oct 30,2019 10:50 AM
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమయ్యాడు కానీ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు. అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే అఖిల్ డిజాస్టర్ కాగా హలో కాస్త ఫరవాలేదు , ఇక మిస్టర్ మజ్ను కూడా ప్లాప్ అయ్యింది దాంతో చాలా జాగ్రత్తలు తీసుకొని , గ్యాప్ కూడా తీసుకొని ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే.

ఈ భామ ఇప్పటివరకు తెలుగులో నటించిన చిత్రాలు కూడా పెద్దగా హిట్ అయిన దాఖలాలు లేవు అయినప్పటికీ స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం అఖిల్ తో రొమాన్స్ చేస్తున్న ఈ భామ వల్ల అఖిల్ కు కలిసి వచ్చి హిట్ కొడతాడా ? లేక పూజా హెగ్డే వల్ల దెబ్బపడనుందా ? సినిమా విడుదల అయితే కానీ తెలీదు.