పాయల్ రాజ్ పుత్ బి గ్రేడ్ హీరోయిన్ అయిపోయిందా !

Published on Nov 30,2019 01:17 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో నటించి సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 చిత్రంలో వీర లెవల్లో రెచ్చిపోయిన తీరుకి షాక్ అయ్యారు ప్రేక్షకులు. అయితే ఆ సినిమా తర్వాత ఈ భామ చేసిన సినిమాలతో తన రేంజ్ ని తానే తగ్గించుకున్నట్లు స్పష్టం అవుతోంది. బి గ్రేడ్ హీరోయిన్ గా మారిపోయిందని అంటున్నారు పలువురు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని మరింత క్యాష్ చేసుకోవాల్సింది పోయి బి గ్రేడ్ చిత్రాల్లో నటించి ఆ క్రేజ్ ని కోల్పోయిందని అంటున్నారు.

ఇక ఇప్పుడు ఈ భామ ఆశలన్నీ సీనియర్ హీరో వెంకటేష్ మీదే ఉన్నాయి. ఎందుకంటే ఈ భామ తాజాగా వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిసెంబర్ 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా హిట్ అయితే పాయల్ రేంజ్ ఒకలా ఉంటుంది లేదంటే షరా మాములే ! ఐటెం గర్ల్ గా మారడమో ? లేక బిగ్రేడ్ సినిమాల్లో నటించడం మాత్రమే మిగిలి ఉంది.