నిత్యామీనన్ ఆ ఇద్దరినీ అవమానిస్తోందా ?

Published on Nov 26,2019 02:48 PM

మలయాళ కుట్టి నిత్యామీనన్ కు కాస్త పొగరు ఎక్కువే అని చాలామంది అంటుంటారు ఎందుకంటే తన అభిప్రాయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతుంది దాంతో పొగరుబోతు అనే మాట వచ్చింది. ఇక తాజాగా ఈ భామ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపెలా ఉన్నాయి. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ , బాలీవుడ్ భామ కంగనా రనౌత్ లను అవమానించేలా ఉన్నాయి నిత్యామీనన్ వ్యాఖ్యలు.

ఇంతకీ నిత్యామీనన్ చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా ....... జయలలిత పాత్రలో నేను మాత్రమే సరిగ్గా సరిపోతాను అని వ్యాఖ్యానించడమే ! జయలలిత పాత్రలో నేను మాత్రమే సరిపోతాను అని అంటే మిగతా వాళ్ళు అంతగా సరిపోరు , నాకంటే బాగా చేయలేరు అని చెప్పడమే కదా ! నిత్యామీనన్ జయలలిత పాత్రలో నటిస్తున్న చిత్రం '' ది ఐరన్ లేడీ '' . అలాగే కంగనా రనౌత్ '' తలైవి '' అనే చిత్రంలో నటిస్తోంది. అంతేనా సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ ఇద్దరి కంటే నేనే జయలలిత పాత్రని సరిగ్గా చేయగలను అని చెప్పడమే కదా !