ఆ ఇద్దరు హీరోయిన్ లలో ఎవరు ?

Published on Feb 04,2019 05:03 PM

మెగా హీరో వరుణ్  తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం '' వాల్మీకి ''. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . అయితే ఇంకా హీరోయిన్ ని ఎంపిక చేయని ఈ చిత్రంలో ఫలానా హీరోయిన్ అంటే లేదు లేదు ఫలానా హీరోయిన్ నటించనుంది అని వార్తలు వస్తున్నాయి తప్ప ఇంకా ఎవరిని డిసైడ్ చేయలేదు . 

తాజాగా ఈ సినిమాకోసం ఇద్దరు హీరోయిన్ లను పరిశీలిస్తున్నారట . ఒకరేమో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కాగా మరొకరు బెంగుళూర్ కం హైదరాబాద్ బేస్డ్ అమ్మాయి  నిధి అగర్వాల్ . ఈ ఇద్దరు హీరోయిన్ లలో ఎవరో ఒకరిని హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ చూస్తున్నారట దర్శకులు హరీష్ శంకర్ . అయితే వరుణ్ తో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ ఈషా రెబ్బ కు వస్తుందా ? లేక నిధి అగర్వాల్ కు వస్తుందా ? చూడాలి .