ప్లాప్ డైరెక్టర్ తో అఖిల్ సినిమానా ?

Published on Jan 30,2019 05:01 PM

ఇప్పటికే అఖిల్ నటించిన అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను చిత్రాలు ప్లాప్ అయ్యాయి , ఇక ఇప్పుడేమో తన నాలుగో చిత్రానికి ప్లాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నాడు అని తెలుస్తోంది . ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . అఖిల్ డిజాస్టర్ కాగా హలో ఫరవాలేదనిపించింది . ఇక ఇప్పుడేమో మిస్టర్ మజ్ను కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది . 

ఇవన్నీ చాలవన్నట్లు అట్టర్ ప్లాప్ దర్శకుడిగా ముద్ర పడిన శ్రీను వైట్ల తో అఖిల్ సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి . శ్రీను వైట్ల గతకొంత కాలంగా డిజాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు . అలాంటి దర్శకుడితో అఖిల్ తన తదుపరి సినిమా అంటే అఖిల్ కెరీర్ పై ఆశలు వదిలేసుకున్నట్లే !