జాను వల్ల 10 కోట్ల నష్టమా !

Published on Feb 13,2020 11:45 PM
తమిళ చిత్రాన్ని ఇష్టపడి తెలుగులో రీమేక్ చేసినందుకు దిల్ రాజు కు ఏకంగా 10 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళంలో విజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో జాను గా రీమేక్ చేసాడు దిల్ రాజు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు దాంతో 10 కోట్ల మేర నష్టం వచ్చేలా కనబడుతోంది. 19 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ ని అమ్మాడు దిల్ రాజు అయితే ఇప్పటివరకు 8 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరో 2 కోట్లు రావచ్చు ఇక మిగతాది నష్టమే !

అయితే శాటిలైట్ , డిజిటల్ , హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కొంత వస్తుంది కాబట్టి దిల్ రాజుకు పెద్దగా ఇబ్బంది లేదు కానీ జాను చిత్రాన్ని కొన్న బయ్యర్లకు మాత్రం నష్టం వస్తోంది. శర్వానంద్ - సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7 న విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లు అంతగా లేవు. దాంతో ప్లాప్ జాబితాలో చేరిపోయింది జాను.