ఇలియానా కాళ్లపై గాయాలు

Published on Sep 16,2019 11:56 AM

గోవా భామ ఇలియానా కాళ్లపై గాయాలు అయ్యాయట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ గాయాలు దేని వల్ల అయ్యాయో మాత్రం తెలీడం లేదని కాకపోతే నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నట్లుంది నాకు అందుకే ఈ గాయాలు అయ్యాయేమో ! అంటూ అమాయకంగా ట్వీట్ చేసింది ఇల్లీ బేబీ. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రు నీబోన్  తో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన ఈభామ అతడితో బ్రేకప్ కాగానే అతడికి సంబందించిన అన్ని ఫోటోలను తన సోషల్ మీడియా నుండి డిలీట్ చేసింది.
అయితే ఈ భామకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నట్లు కొత్తగా చెబుతోంది. అలా నిద్రలో లేచి ఫ్రిడ్జ్ లోంచి స్నాక్స్ తీసుకొని తింటానేమో అందుకే కాళ్లకు గాయాలు అయ్యాయి , మచ్చలు ఏర్పడ్డాయి అంటూ ట్వీట్ చేసింది. అంటే ఈ ట్వీట్ తో కాస్త లైమ్ లైట్ లోకి రావడానికి చేసి ఉంటుందేమో! ఎందుకంటే చేతిలో సినిమాలు లేవు కదా!