మాధవీలత పై అసభ్యకరమైన కూతలు

Published on Feb 11,2020 02:45 PM

నచ్చావులే ఫేమ్ మాధవీలత పై అసభ్యకరమైన కూతలు కూసిన ఓ నెటిజన్ ని అదేస్థాయిలో ఆడుకుంది మాధవీలత. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఎం ఐ ఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి పాతబస్తీ లోని హిందూ దేవాలయం అభివృద్ధికి నిధులు ఇప్పించాల్సిందిగా కోరాడు. దానికి వెంటనే సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఆమోదించడమే కాకుండా ఆదేశాలు కూడా జారీ చేసాడు. ఇంకేముంది ఇది వైరల్ అయ్యింది.

అక్బరుద్దీన్ ఇలా మారడానికి మోడీ కారకుడు అంటూ మాధవీలత ఓ పోస్ట్ పెట్టింది. అది కొంతమందికి నచ్చలేదు అందుకే మాధవీలత ని రేప్ చేసి చంపేస్తే దరిద్రం పోతుంది అని ట్వీట్ చేసాడు ఓ దురభిమాని. ఈ విషయం మాధవీలతకు తెలిసి లుచ్చా .... లఫంగి అంటూ మాధవీలత కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. అయితే ఓ స్త్రీ ని పట్టుకొని అంత దారుణమైన కామెంట్ చేయడం సదరు నెటిజన్ చేసిన తప్పే అని చెప్పాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది అది నచ్చకపోతే ఖండించాలి అంతేకాని మనిషిని దారుణమైన రీతిలో అసభ్యకరమైన రాతలతో ఇబ్బంది పెట్టకూడదు కదా !