ఐ డోంట్ కేర్ అంటున్న తరుణ్ భాస్కర్

Published on Oct 27,2019 11:51 AM

ఎవరేమి అనుకున్నా ఐ డోంట్ కేర్ ....... నాకు నచ్చింది చేసుకుంటూ పోతా అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారు అని భయపడే వ్యక్తిని కాను అని అంటున్నాడు దర్శకుడు కమ్ హీరో దాస్యం తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు చిత్రంతో సంచలనం సృష్టించిన తరుణ్ భాస్కర్ తాజాగా మీకు మాత్రమే చెప్తా చిత్రంతో హీరోగా మారిన విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న మీకు మాత్రమే చెప్తా నవంబర్ 1 న విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు తరుణ్ భాస్కర్.
             దర్శకుడిగా సినిమాలు లేవేమో అందుకే ఇలా నటించడానికి సిద్దమయ్యాడు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారని కానీ నాకు నచ్చిన పని చేసుకుంటూ పోవడమే నాకిష్టం. డైరెక్షన్ కంటే యాక్టింగ్ సులువు , నటుడిగా నటిస్తే రాత్రి హాయిగా నిద్రపోవచ్చు అదే డైరెక్షన్ అయితే అలా ప్రశాంతంగా నిద్రపోలేం అని అంటున్నాడు. ఇక మీకు మాత్రమే చెప్తా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో నవంబర్ 1 న తేలనుంది.