త్వరలో చచ్చిపోతానంటున్న హీరోయిన్ మాధవీలత.

Published on Jan 31,2020 05:39 PM
నేను త్వరలోనే చచ్చిపోతాను అంటూ సంచలన ట్వీట్ చేసింది టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత. నచ్చావులే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మాధవీలత ఆ సినిమా సంచలన విజయం సాధించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం స్టార్ డం అందుకోలేకపోయింది పాపం ఈ భామ. నచ్చావులే చిత్రం తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది అలాగే చిన్న చిన్న క్యారెక్టర్ లు కూడా పోషించింది. కానీ అనుకున్న బ్రేక్ దక్కకపోవడంతో అంతగా సినిమాల్లో నటించడం లేదు.

అంతేకాదు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు కూడా చేసి సంచలనం సృష్టించింది మాధవీలత. తాజాగా ఈ భామ తనకు తలనొప్పి , జలుబు , జ్వరం , నిద్రలేమి తో తరచుగా బాధపడుతున్నానని అయితే వాటి కోసం నిత్యం ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటున్నానని ఏదో ఒకరోజు ప్రేమ సినిమాలో హీరోయిన్ రేవతి చనిపోయినట్లుగా నేను కూడా ఎప్పుడో చనిపోతాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అయితే నెటిజన్లు మాత్రం మాధవీలతకు మద్దతుగా నిలుస్తున్నారు.