హైపర్ ఆది కూడా హీరో కాబోతున్నాడట

Published on Dec 28,2019 12:04 PM

జబర్దస్త్ తో హైపర్ ఆది కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అది ఎంతగా అంటే పలువురు సినీ ప్రముఖులు సైతం హైపర్ ఆది పంచ్ లకు ఫ్యాన్ అయిపోయారు. దాంతో బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఈ సమయంలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడట హైపర్ ఆది. ఇప్పటికే చాలా కథలు విన్నాడట అయితే అవి పెద్దగా నచ్చలేదు దాంతో ఇంకా స్టోరీలు వింటూనే ఉంటున్నాడు. ఒకసారి పక్కాగా కథ సెట్ అయితే ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడమే తరువాయి అన్నమాట. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దాంతో హైపర్ ఆది కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

జబర్దస్త్ పుణ్యమా అని బోలెడు మంది కమెడియన్లు తయారయ్యారు అయితే ఇమేజ్ రావడంతో ఇలా హీరోగా నటించాలని  తహతహ లాడుతున్నారు. అయితే ఆదికి ఫైట్లు , డ్యాన్స్ లు ఉంటే కుదరదు కాబట్టి అలాంటి చిత్రాలు కాకుండా కామెడీ , లవ్ కథలకు ప్రాధాన్యత ఇస్తాడట. కామెడీ హీరోల లోటు తెలుగునాట ఉంది కాబట్టి ఆరకంగా ప్రయత్నాలు చేస్తున్నాడట ఆది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.