సింగర్ ఆత్మహత్యకు భర్తే కారణమట

Published on Feb 18,2020 07:21 PM

కన్నడ సినీ గాయని సుష్మిత ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని అంటున్నారు. సుష్మిత చనిపోయే ముందు తన తమ్ముడు సచిన్ కు వాట్సాప్ మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకుంది. కన్నడంలో పలు చిత్రాలలో పాటలు పాడింది సుస్మిత అలాగే పలు సీరియల్ లకు కూడా పాటలు పాడింది. ఏడాది క్రితం శరత్ అనే యువకుడితో పెళ్లి అయ్యింది సుస్మితకు. అయితే పెళ్లి అయినప్పటి నుండి అదనపు కట్నం కోసం తీవ్ర హింసలు పెడుతున్నారట భర్త శరత్ తో పాటుగా భర్త బంధువులు వైదేహి , గీతలు.

చిత్రహింసలు ఎక్కువ కావడంతో వాటిని భరించలేక నిన్న బెంగుళూర్ లో ఆత్మహత్య చేసుకుంది. సింగర్ సుస్మిత ఆత్మహత్య కన్నడ చిత్ర రంగంలో సంచలనం సృష్టించింది. నా చావుకు బాధ్యులు శరత్ , వైదేహి , గీత కాబట్టి వాళ్ళని క్షమించకూడదు అంటూ డెత్ నోట్ లో పేర్కొంది సుష్మిత. సింగర్ సుస్మిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.