చిరంజీవి ఇంటి ముందు నిరాహారదీక్ష !

Published on Feb 28,2020 02:47 PM

మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఈనెల 29న  అమరావతి రాజధాని జె ఏసీ నిరాహారదీక్ష చేయడానికి పిలుపునిచ్చింది. దాంతో ఒక్కసారిగా హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనెల 29 న ఒకరోజు నిరాహారదీక్ష చేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు అమరావతి జెఏసీ . ఆమేరకు ప్రకటన విడుదల చేసారు. అమరావతిలోని ఏపీ రాజధాని కొనసాగాలని అందుకు చిరంజీవి మద్దతు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. చిరంజీవి జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో చిరంజీవి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక చిరంజీవి ఫ్యాన్స్ మాత్రం నిరాహారదీక్షకు పిలుపునిచ్చిన వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసే వాళ్లకు బాలయ్య ఇంటి ముందు దీక్ష కు దిగే దమ్ముందా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అమరావతి లొల్లి హైదరాబాద్ కు పాకిందన్న మాట !