భారీగా నష్టపోతున్న దేవరకొండ బయ్యర్లు

Published on Feb 18,2020 06:36 PM
విజయ్ దేవరకొండ మీదున్న క్రేజ్ తో భారీ రేట్లకు కొన్నారు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని అయితే ఈ సినిమా కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా సాధించలేక చతికిల బడింది దాంతో సుమారుగా 18 కోట్ల నష్టం చవిచూసేలా ఉన్నారు బయ్యర్లు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత కె ఎస్ రామారావు నిర్మించిన చిత్రం ఈ వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ సరసన ఏకంగా నలుగురు భామలు రాశి ఖన్నా , ఐశ్యర్య రాజేష్ , కేథరిన్ ట్రెసా , ఇసా బెల్ నటించారు. ప్రేమికుల దినోత్సవం అంటూ ఫిబ్రవరి 14 న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది.

23 కోట్లకు ఈ సినిమాని కొన్నారు బయ్యర్లు. అయితే 5 నుండి 6 కోట్లు మాత్రమే వచ్చేలా కనబడుతోంది అంటే 18 కోట్ల నష్టం అన్నమాట. బయ్యర్లకు 18 కోట్ల నష్టం అంటే మాములు విషయం కాదు కొంతమంది రోడ్డున పడటమే ! విజయ్ దేవరకొండకు ఇది వరుసగా రెండో దారుణమైన ఓటమి. డియర్ కామ్రేడ్ పై కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అది దెబ్బ కొట్టింది అలాగే ఇప్పుడేమో వరల్డ్ ఫేమస్ లవర్ పై ఆశలు పెట్టుకుని సిక్సర్ కొట్టబోతున్నాను అని అన్నాడు కట్ చేస్తే డకౌట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.