సాహో కు భారీ నష్టాలే

Published on Sep 08,2019 01:11 PM

సాహో చిత్రం కొన్న బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదలైన సాహో చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఆ తర్వాత సాహో తేలిపోయింది. దాంతో భారీ రేట్లకు కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. సాహో చిత్రానికి ఒక్క హిందీలోనే లాభాలు వస్తున్నాయి ఇక మిగతా చోట్ల భారీ నష్టాలు రావడం ఖాయమైపోయింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో అలాగే ఓవర్ సీస్ లో పెద్ద మొత్తంలో నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాల తీవ్రత దాదాపు 70 నుండి 90 కోట్ల వరకు ఉండొచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 380 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది. అయితే షేర్ మాత్రం 200 కోట్లు మాత్రమే వచ్చింది దాంతో భారీ ఎత్తున నష్టపోతున్నారు సాహో ని కొన్న బయ్యర్లు.