రెండు సినిమాల మధ్య రిలీజ్ లొల్లి

Published on Jan 03,2020 04:26 PM
ఈనెల 11 న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల అనుకున్నారు అలాగే ఈనెల 12 న అంటే మరుసటి రోజున అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం విడుదల చేయాలి అని అనుకున్నారు కట్ చేస్తే మహేష్ బాబు సినిమాతో పాటే మా సినిమా రిలీజ్ చేస్తామని పట్టుబడుతున్నారట నిర్మాత అల్లు అరవింద్. ఇక ఈ అగ్ర నిర్మాత కు తోడుగా అతడి వెంట ఉన్నవాళ్లు సైతం మహేష్ బాబు సినిమాతో మన సినిమాని విడుదల చేయాల్సిందే అని అంటున్నారట.

రెండు భారీ చిత్రాలు ఒకే రోజున రావడం వల్ల తప్పకుండా ఆ ప్రభావం కలెక్షన్ల మీద ఉంటుంది కాబట్టి దాని వల్ల నష్టపోయేది బయ్యర్ లతో పాటుగా నిర్మాత కూడా కాబట్టి జనవరి 11 న మహేష్ జనవరి 12న అల్లు అర్జున్ సినిమాలు వస్తే మంచిదని సలహా ఇస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. కానీ ఈ రెండు సినిమాల విడుదల లొల్లి మాత్రం ఇంకా సెట్ కాలేదట. అందుకే సరిలేరు నీకెవ్వరు సెన్సార్ అయినప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు అలాగే ఈరోజు అల వైకుంఠపురములో చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోనుంది. అది సెన్సార్ అయితే ఈలోపు మరోసారి చేర్చించుకొని అప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ లు మరోసారి ప్రకటిస్తారట.