సరికొత్త కథాంశంతో విజయ్ 63 చిత్రం

Published on Feb 05,2019 02:32 PM

తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా తన 63 వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే అట్లీ - విజయ్ ల కాంబినేషన్ లో మెర్సల్ , తేరి చిత్రాలు వచ్చాయి . ఆ రెండు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి దాంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . 

ఇక తాజాగా సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్ర కథాంశం గురించి మాట్లాడి మరింతగా అంచనాలు పెంచేలా చేసాడు . దక్షిణాదిలో ఇలాంటి కథతో ఇప్పటి వరకు ఎలాంటి చిత్రం కూడా రాలేదని , ఇది మరో లగాన్ లా చిరస్థాయిగా నిలిచి పోతుందని అన్నాడు రెహ్మాన్ . క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది . నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .