అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్

Published on Mar 27,2019 10:47 AM

వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేయడమే ఆలస్యం పది నిమిషాల్లో వెయ్యి టికెట్లు అమ్ముడుపోవడం సంచలనం సృష్టిస్తోంది . ఈ విషయాన్నీ దర్శకులు రాంగోపాల్ వర్మ స్వయంగా వెల్లడిస్తూ ట్వీట్ చేసాడు . నిన్న సాయంత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసారు , ఇంకేముంది వెంటనే చకా చకా టికెట్లు అమ్ముడు పోతున్నాయి . 

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో అసలు విషయం ఉందో ? లేదో ? కానీ చంద్రబాబు ని మాత్రం విలన్ గా చూపించి బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు వర్మ . ఈనెల 29 న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే . సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎన్నికలలో ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో ?