ఈ భారీ కటౌట్ గోల ఏంటో

Published on Nov 25,2019 04:10 PM

మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదల కావడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది అయినప్పటికీ ఇప్పుడే మహేష్ బాబు భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు మహేష్ ఫ్యాన్స్ దాంతో సినిమా విడుదల కావడానికి ఇంకా 46 రోజుల సమయం ఉండటంతో ఈ భారీ కటౌట్ గోల ఏంట్రా బాబూ ! అని అంటున్నారు మహేష్ యాంటీ ఫ్యాన్స్. తాజాగా హైదరాబాద్ లో మహేష్ బాబు 81 అడుగుల భారీ కటౌట్ ని ఏర్పాటు చేసారు మహేష్ అభిమానులు. ఈ కటౌట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కూడా.

అయితే సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న విడుదల అవుతోంది అంటే ఇంకా 46 రోజులు అన్నమాట. ఇంత ముందుగా అంత పెద్ద కటౌట్ ఎందుకు పెట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. భారీ కటౌట్ ఏర్పాటు చేయడం కామనే అయితే మరీ ఇంత ముందుగానా ? అంటూ ఆశ్చర్య పోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ వండర్ క్రియేట్ చేస్తోంది యూట్యూబ్ లో.