త్రివిక్రమ్ కు భారీ కటౌట్

Published on Jan 03,2020 04:29 PM

దర్శకులు త్రివిక్రమ్ కు భారీ కటౌట్ ఏర్పాటు చేసారు దాంతో సంచలనం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాని జనవరి 12 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. దాంతో ఇప్పుడే కటౌట్ ల హడావుడి మొదలయ్యింది. సాధారణంగా హీరోలకు కటౌట్ లు పెడుతుంటారు అభిమానులు అయితే హీరో అల్లు అర్జున్ తో పాటుగా దర్శకులు త్రివిక్రమ్ కటౌట్ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేసారు దాంతో ఈ టాపిక్ వైరల్ అవుతోంది.

అయితే హీరోతో పాటుగా దర్శకుడికి కూడా కటౌట్ పెడితే హీరోల అభిమానులు కొందరైనా ఫీల్ అవ్వడం ఖాయం. ఎందుకంటే తమ హీరో కన్నా ఎవరూ ఎక్కువ కారు వాళ్ళ దృషిలో. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి దాంతో ఈ అల వైకుంఠపురములో చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో టబు కూడా నటిస్తోంది.