70 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అవుతుందా ?

Published on Feb 13,2019 11:09 AM

నందమూరి బాలకృష - బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఇంతకుముందు సింహా , లెజెండ్ చిత్రాలు రాగా ఆ రెండు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి దాంతో బాలయ్య బాబుకు బోయపాటి శ్రీను అంటే మంచి నమ్మకం కుదిరింది . అయితే తాజాగా ఈ ఇద్దరూ  కలిసి మూడో సినిమాకు చుట్టబోతున్నారు . రెండు సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి నమ్మకం ఉంటే ఫరవాలేదు కానీ మరీ ఆ నమ్మకం ఎక్కువై పోయి 70 కోట్ల బడ్జెట్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట . 

70 కోట్ల బడ్జెట్ అంటే సినిమా మొత్తం 150 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి . అప్పుడే 70 కోట్లకు పైగా షేర్ వస్తుంది అప్పుడే బయ్యర్లకు లాభాలు వస్తాయి లేదంటే నష్టాలు తప్పవు . బాలయ్య సినిమా ఇప్పటివరకు వంద కోట్ల క్లబ్ లో చేరలేదు అలాంటిది 70 కోట్ల బడ్జెట్ అంటే పెద్ద రిస్క్ అనే చెప్పాలి . అంతేకాదు ఇటీవలే విడుదలైన  ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయ్యింది . పట్టుమని 20 కోట్ల షేర్ కూడా రాలేదు . అలాంటి సమయంలో ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి .