ఆసియా అందగాడు ఎవరో తెలుసా ?

Published on Dec 06,2019 12:15 PM

ఈ దశాబ్దపు ఆసియా ఖండపు అందగాడు ఎవరో తెలుసా ? బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ . అవును బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ దశాబ్దపు ఆసియా అందగాడుగా టైటిల్ గెలుచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన బ్రిటన్ వీక్లి ఈ పోల్ ని ఆసియాలో నిర్వహించగా అత్యధిక ఓట్లని పొంది నెంబర్ వన్ టైటిల్ గెల్చుకున్నాడు హృతిక్ రోషన్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హృతిక్ అభిమానులతో పాటుగా ఇతరులు కూడా ఓటింగ్ లో పాల్గొని ఈ అవార్డు ని గెల్చుకునేలా చేసారు.

హృతిక్ రోషన్ కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది ఎందుకంటే ''సూపర్ 30 '' అనే బయోపిక్ లో నటిస్తే అది మంచి విజయాన్ని సాధించింది. అలాగే వార్ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తే ఏకంగా బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. వార్ చిత్రం వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించింది. ఇక ఇప్పుడేమో ఆసియా అందగాడు అవార్డు ని తెచ్చిపెట్టింది.