సమంత జాను ఎలా ఉందంటే

Published on Feb 07,2020 11:00 PM

శర్వానంద్ - సమంత నటించిన జాను చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో జాను గా రీమేక్ చేసారు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. ఎమోషనల్ లవ్ జర్నీ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలాగే రూపొందింది అయితే సినిమాకు మైనస్ ఏంటంటే స్లో నెరేషణ్. సినిమా స్లోగా సాగడం వల్ల అక్కడక్కడా బోర్ కొట్టడం ఖాయం.

ప్రేమికులను , యువతని బాగా ఆకట్టుకునే కథాంశంతో ఈ జాను చిత్రం తెరకెక్కింది. అయితే సినిమా కాస్త ఫాస్ట్ గా సాగేటట్లు ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. తమిళ చిత్రాన్ని చూసిన వాళ్లకు ఈ సినిమా నచ్చకపోవచ్చు అయితే మొట్టమొదటిసారిగా చూసేవాళ్లకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. కాకపోతే చిన్న లోటు ఏంటంటే స్లో నెరేషన్. శర్వానంద్ - సమంత ల నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నేపథ్య సంగీతం , పాటలు కూడా ఆకట్టుకునేలా రూపొందాయి. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు హిట్ చేస్తారా ? లేదా ? అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.