హాట్ భామ కేతిక శర్మ ని ఎంపిక చేసిన పూరి

Published on Mar 12,2019 10:17 AM

రెచ్చగొట్టే భంగిమలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న భామ '' కేతిక శర్మ ''. మోడల్ గా రాణిస్తున్న ఈ హాట్ భామ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్ . పూరి కొడుకు పూరి ఆకాష్ హీరోగా '' రొమాంటిక్ '' అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . తన శిష్యుడిని దర్శకుడిగా పరిచేయం చేస్తున్న పూరి కేతిక శర్మ అనే హాట్ మోడల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసాడు . 

ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ హాట్ భామ స్టిల్స్ కూడా వదిలాడు . కేతిక శర్మ హాట్ మోడల్ గా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది . రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిస్తూ అందాల ఆరబోతతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది . హాట్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి నిద్ర లేకుండా చేస్తోంది యువతకు . ఇక వెండితెర మీద ఈ భామ ఎంతగా రెచ్చిపోతుందో చూడాలి ఎందుకంటే అసలే హాట్ భామ ఆపై రొమాంటిక్ సినిమా ...... ఇంకేముంది రచ్చ రచ్చే !