రాజకీయాల్లో చేరిన హాట్ భామ

Published on Dec 01,2019 02:22 PM

హాట్ భామ నమిత రాజకీయాల్లోకి చేరింది. భారీ అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ నమిత అయితే గతకొంత కాలంగా సినిమాలకు దూరమైన ఈ భామ భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని కాషాయ తీర్థం పుచ్చుకుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యకుడు అయిన జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరింది నమిత.

తెలుగు, తమిళ , మలయాళ భాషలలో పలు చిత్రాల్లో నటించిన నమిత సినిమాల్లో హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే గ్లామర్ పాత్రలతో మాత్రం కుర్రాళ్ళని అలరించింది , దాంతో ఐటెం భామగా మారింది. యువతలో క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కెరీర్ లేకపోవడంతో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పుడేమో తమిళనాట ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది.