నగ్నంగా నటించనంటున్న హాలీవుడ్ భామ

Published on Mar 10,2020 07:59 PM

హాలీవుడ్ భామ కీరా నైట్లే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల్లో న్యూడ్ గా నటించేది లేదని తేల్చి చెప్పింది. నాకు ఇద్దరు సంతానం కాబట్టి ఇకపై నగ్న సన్నివేశాల్లో నటించకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నగ్నంగా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే నేను నటించిన నగ్న దృశ్యాలను పోర్న్ సైట్ లలో పెడుతున్నారు దాంతో నన్ను పోర్న్ స్టార్ అనుకునే ప్రమాదం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది కీరా నైట్లే.

హాలీవుడ్ చిత్రాల్లో న్యూడ్ గా నటించడం ,సెక్స్ సన్నివేశాల్లో నటించడం చాలా సర్వసాధారణం అయినప్పటికీ ఇప్పుడు పోర్న్ ఇండస్ట్రీ యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది దాంతో ఇలా జాగ్రత్తలు తీసుకుంటోంది కీరా నైట్లే. అయితే చిన్న వెసులుబాటు కల్పిస్తోంది ఈ భామ . ఒకవేళ స్క్రిప్ట్ డిమాండ్ మేరకు నగ్న సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తప్పకుండా ఒప్పుకుంటుందట కానీ ఆ సీన్స్ ని తన డూప్ పై చేసుకోండని సెలవిస్తోంది.