హిట్ టీజర్ వచ్చేసింది

Published on Jan 31,2020 05:54 PM

నాని నిర్మాతగా మారి ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి నిర్మిస్తున్న చిత్రం '' హిట్ ''. విశ్వక్ సేన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాని. ఇక ఈరోజు హిట్ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ చూస్తుంటే తప్పకుండా అలరించేలాగే కనబడుతోంది. టీజర్ ప్రేక్షకులను అలరించేలా ఆసక్తికరంగా సాగడంతో నాని చాలా సంతోషంగా ఉన్నాడట.

ఈరోజు ఉదయం హిట్ టీజర్ విడుదల చేసారు. విశ్వక్ సేన్ హీరోగా నటించగా రుహాణి శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రానికి కొలను శైలేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ద్రుష్టి ని తనవైపుకు తిప్పుకున్న ఈ హీరో హిట్ తో భారీ హిట్ కొడతాడా ? హీరోగా నిలబడతాడా ? చూడాలి. విజయ్ దేవరకొండ లాగే రౌడీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ అందులో విజయం సాధిస్తాడా ? చూడాలి .