హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్

Published on Mar 01,2019 03:41 PM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 చిత్రం ఈరోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 118 చిత్రం నిజంగానే విభిన్న తరహా చిత్రం అనడంలో సందేహం లేదు. 

కళ్యాణ్ రామ్ మొదటి నుండి కూడా విభిన్న తరహా చిత్రాలను చేయడానికి ప్రయత్నాలు చేసాడు . అయితే చాలావరకు అపజయాలను మాత్రమే చవిచూశాడు. ఎన్ని ప్లాప్ లు వచ్చినా తన మొండితనంని మాత్రం వదల్లేదు దాంతో తాజాగా 118 తో హిట్ కొట్టేసాడు కళ్యాణ్ రామ్.