హిట్టు కొట్టిన అఖిల్

Published on Jan 25,2019 11:52 AM

ఈరోజు అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను చిత్రం రిలీజ్ అయ్యింది . వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భోగవల్లిప్రసాద్ నిర్మించాడు . అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది . ఓవర్ సీస్ లో ఈ చిత్రానికి దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి అయితే టాక్ మాత్రం బాగానే ఉంది . ప్రేమకథా చిత్రానికి ఎంటర్ టైన్ మెంట్ ని అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ని యాడ్ చేసి ప్రేక్షకులను మెప్పించేలా తీర్చి దిద్దాడు వెంకీ . 

తొలిప్రేమ వంటి సూపర్ హిట్ తర్వాత వెంకీ నుండి వచ్చిన రెండో చిత్రం కు కూడా హిట్ టాక్ రావడంతో రెండో గండాన్ని దాటేసినట్లే ! అఖిల్ లుక్స్ , పెర్ఫార్మెన్స్ అలాగే నిధి అగర్వాల్ అందాలు ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయట . అలాగే తమన్ సంగీతం కూడా మిస్టర్ మజ్ను కి హైలెట్ గా నిలిచిందని అంటున్నారు . మొత్తానికి అఖిల్ మూడో సినిమాతో హిట్ కొట్టాడు .