మే 1 న బుల్లితెరపై హిట్ మూవీ

Published on Apr 22,2020 04:35 PM
మే 1 న విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాని జెమిని టివిలో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా దుమ్ము దులిపేసింది హిట్ చిత్రం. వెండితెర పై కూడా మంచి విజయాన్నే సాధించింది హిట్ చిత్రం. అయితే మరింతగా విజయం అందుకునే సమయంలోనే కరోనా మహమ్మారి వేగవంతం కావడంతో హిట్ చిత్రాన్ని థియేటర్ లనుండి తీసేయాల్సి వచ్చింది.

దాంతో అమెజాన్ లో స్ట్రీమింగ్ కి ఇచ్చారు. ఇక ఇప్పుడేమో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో అంటూ మే 1 న టెలికాస్ట్ చేయనున్నారు జెమిని ఛానల్ వాళ్ళు. విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మించడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రం హిట్ కావడంతో దానికి సీక్వెల్ ప్లాన్ చేసారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి.