హిందీలో కూడా సంచలనం సృష్టించిన మహేష్ బాబు

Published on Apr 03,2019 11:56 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంతో హిందీలో కూడా సంచలనం సృష్టించాడు. ఇప్పటికే మహర్షి చిత్రంతో శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో వండర్స్ క్రియేట్ చేసిన మహేష్ తాజాగా హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా వండర్ క్రియేట్ చేసాడు. మహర్షి సినిమా హిందీ హక్కులు ఎన్ని కోట్లకు పోయాయో తెలుసా...... 26 కోట్లు. 

అవును వినడానికి ఆశ్చర్యం గా అనిపించినప్పటికి నిజమే ! మహర్షి చిత్రాన్ని హిందీ హక్కుల కోసం 26 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో 27 కోట్లకు పైగా వచ్చాయి. ఇక హిందీ రైట్స్ 26 కోట్లు రావడంతో ఇప్పటికే 53 కోట్ల బిజినెస్ జరిగింది. దాంతో మహర్షి చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది.