ప్రభాస్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు

Published on May 02,2020 03:32 PM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని రాయదుర్గం సమీపంలో గల భూమిలో 2083 చదరపు గజాల భూమిని కొన్నాడు ప్రభాస్. ఆ భూమిలో గెస్ట్ హౌజ్ కట్టుకున్నాడు , గతకొంతకాలంగా ఆ గెస్ట్ హౌజ్ ని వాడుకుంటున్నాడు అయితే అది ప్రభుత్వ భూమి అని దాన్ని ఎవరో కబ్జా చేసి మీకు అమ్మారు ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి మేము స్వాధీనం చేసుకుంటున్నాం అంటూ గత ఏడాది తెలంగాణ రివిన్యూ శాఖ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది దాంతో ప్రభాస్ కోర్టుకెక్కాడు.

రంగారెడ్డి జిల్లా సివిల్ కోర్టులో ప్రభాస్ కు అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో రెవిన్యూ శాఖాధికారులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు లో వాదనలు విన్న తర్వాత ఇపుడున్న యధాతధ స్థితిని కొనసాగించాలని ప్రభాస్ కు ఈ భూమి పై ఎలాంటి హక్కులు లేవని అయితే ఇదే సమయంలో న్యాయపోరాటం చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది దాంతో ప్రభాస్ కు గట్టి షాక్ తగిలింది. ప్రస్తుతం ప్రభాస్ గెస్ట్ హౌజ్ తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉంది. తుది తీర్పు వచ్చాక అది ప్రభుత్వానికి చెందుతుందా ? లేక ప్రభాస్ కా అన్నది తేలనుంది.