బాలయ్యకు చుక్కలు చూపిస్తున్న హీరోయిన్లు

Published on Dec 19,2019 12:06 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ కు చుక్కలు చూపిస్తున్నారు హీరోయిన్ లు. బాలయ్య సీనియర్ హీరో కాబట్టి అతడితో కలిసి నటించడానికి , రొమాన్స్ చేయడానికి యంగ్ హీరోయిన్ లు అంతగా ఆసక్తి చూపించడం లేదు పైగా బాలయ్య తో నటించడం అంటే రిస్క్ అంటూ పలువురు హీరోయిన్ లను హెచ్చరించే బ్యాచ్ అంటూ ఒకటి ఉంది ఇక్కడ హైదరాబాద్ లో దాంతో బాలయ్య కు హీరోయిన్ ల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే సీనియర్ హీరోలైన చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ లకు కూడా ఇదే ఇబ్బంది ఎదురు అవుతోంది అయితే వాళ్ళకంటే ఎక్కువగా సమస్య ఉంది బాలయ్య కు మాత్రమే !

తాజాగా రూలర్ చిత్రంలో అంతగా పేరు ఊరు లేని వేదిక , సోనాల్ చౌహన్ లను హీరోయిన్ లుగా తీసుకోవాల్సి వచ్చింది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లే బోయపాటి సినిమాలో కూడా హీరోయిన్ ల కొరత చాలా ఉంది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ని తీసుకోవాలని అనుకుంటే నేను చేయడం లేదు అంటూ ఏకంగా ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక కేథరిన్ ట్రెసా గురించి చెప్పాల్సి వస్తే అంతగా డిమాండ్ లేని ఈ భామకు సినిమాలే లేవు అయినప్పటికీ కోటి డిమాండ్ చేస్తోందట బాలయ్య పక్కన నటించడానికి. దాంతో దర్శక నిర్మాతలకు పెద్ద తలనొప్పి గా మారింది హీరోయిన్ ల సమస్య.