రజనీకాంత్ సరసన ఇద్దరు భామలు

Published on Feb 28,2019 04:37 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ లుగా ఇద్దరినీ ఎంపిక చేసారు . ఒకరేమో నయనతార కాగా మరో భామ కీర్తి సురేష్ . నయనతార ఇప్పటికే రజనీకాంత్ తో పలు చిత్రాల్లో నటించింది కాగా కీర్తి సురేష్ కు మాత్రం ఇది మొదటిసారి . 

మార్చి మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . దాంతో ఈ సినిమాపై  అంచనాలు భారీగా ఏర్పడ్డాయి . మురుగదాస్ డైరెక్టర్ కావడంతో రజనీకాంత్ కు తప్పనిసరిగా కమర్షియల్ హిట్ రావడం ఖాయమని నమ్ముతున్నారు .ఇటీవలి కాలంలో  ఇప్పటివరకు రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి దాంతో ఈ సినిమా దాన్ని బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు .