హద్దులు దాటేసి రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా

Published on Apr 14,2020 01:59 PM
తెలుగు హీరోయిన్ లు కాస్త పద్దతిగానే ఉంటారని నానుడి. ఉత్తరాది భామలు ఎంతగైనా తెగించి నటిస్తారు అలాగే అందాలను ఆరబోస్తారని వినికిడి కానీ ఉత్తరాది భామలకు మేము ఎంతమాత్రం తీసిపోము అంటూ కొంతమంది భామలు అందాల ఆరబోతతో సంచలనం సృష్టించారు. కాగా నేను సైతం ఎంతమాత్రం తీసిపోను అంటూ హద్దులు దాటేసి రెచ్చిపోయింది తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ! తాజాగా ఈ భామ లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

హిందీలో కియారా అద్వానీ పోషించిన పాత్రని తెలుగులో ఈషా రెబ్బా నటిస్తోంది. ఈ పాత్రలో వీరలెవల్లో రెచ్చిపోయి నటించిందట ఈషా రెబ్బా. శృంగార సన్నివేశాల్లో ఈషా నటించిన తీరుకి షాక్ అవుతున్నారట వెబ్ సిరీస్ బృందం. ఈ వెబ్ సిరీస్ కు దర్శకులు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడట. త్వరలోనే ఈ లస్ట్ స్టోరీస్ స్ట్రీమింగ్ కానుంది. అది ఒకసారి స్ట్రీమింగ్ అయితే ఈషా రెబ్బా సంచలనం సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఈ భామ కూడా లస్ట్ స్టోరీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.