డైరెక్టర్ గా మారిన హీరోయిన్

Published on Mar 10,2020 07:36 PM

నటి కళ్యాణి డైరెక్టర్ గా మారింది. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన శేషు చిత్రంలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్ గా కెరీర్ లేకపోవడంతో సహాయ నటిగా పలు చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా ఉండగానే దర్శకులు సూర్యకిరణ్ ని పెళ్లి చేసుకున్న కళ్యాణి ఆ తర్వాత విభేదాలతో అతడితో విడిపోయింది. ఇక ఇప్పుడేమో మెగా ఫోన్ చేతబట్టి డైరెక్టర్ అయ్యింది.

చేతన్ చీను ని హీరోగా పరిచయం చేస్తూ సైకలాజికల్ థ్రిల్లర్ ని అందించడానికి సిద్ధం అవుతోంది కళ్యాణి. ఈరోజు హోలీ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గ్లిమ్సే వదిలింది. హీరోయిన్ గా , నిర్మాతగా వ్యవహరించిన కావేరి కళ్యాణి ఇప్పుడు మహిళా దర్శకురాలు అవుతోంది. మరి డైరెక్టర్ గా సత్తా చాటుతుందా ? లేదా ? అన్నది చూడాలి. మలయాళ భామ అయిన కళ్యాణి టాలీవుడ్ లో స్థిరపడింది.