పాపకు జన్మనిచ్చిన హీరోయిన్

Published on Jan 24,2020 09:40 PM

శుక్రవారం రోజున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ స్నేహ. తెలుగులో అలాగే తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన స్నేహ తమిళ హీరో ప్రసన్నని ప్రేమించింది. ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో 2012 లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ విహాన్ అనే బాబు మొదటి సంతానం కాగా తాజాగా రెండో సంతానం కు జన్మనిచ్చింది స్నేహ. శుక్రవారం రోజున ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ప్రసన్న తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏంజెల్ మా ఇంట అడుగుపెట్టింది అంటూ పోస్ట్ పెట్టాడు.

ప్రసన్న - స్నేహ లు మళ్ళీ తల్లిదండ్రులు అయ్యారన్న విషయం ఇండస్ట్రీలో తెలియడంతో అందరూ స్నేహాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శుక్రవారం రోజునే అమ్మాయి పుట్టడంతో లక్ష్మీదేవి వచ్చింది అంటూ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు స్నేహ - ప్రసన్నలు.